![]() |
![]() |

వాలెంటైన్ వీక్ లో ఈ రోజు హగ్ డే. ఇక జ్యోతి అలియాస్ గుప్పెడంత మనసు జగతి మేడం సుకు పూర్వజ్ ని హగ్ చేసుకున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక ఆ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. "మేమిద్దరం కలిసి ఒక సంవత్సరం అయ్యింది... జీవితం పూర్తిగా మారిపోయింది... నా మనసులో ఉన్న మాటలు చెప్పడానికి పదాలు సరిపోవు.... ఆ ప్రేమ, కౌగిలింతలు, ముద్దులు, సపోర్ట్ కు చాలా ధన్యవాదాలు.
నీ సహనానికి నామీద నువ్వు చూపించే శ్రద్ధకు నేను ఫిదా. నువ్వు నీ ప్రేమతో నా జీవితాన్ని నింపేసావు. నా భర్తగా నువ్వు దొరకడం నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు... నిన్ను ప్రేమిస్తున్నాను " అని చెప్పింది. ఇప్పుడు అసలు విషయం అర్ధమవుతోంది అదే రీసెంట్ గా ఆమె తన గుండెలపై రంగురంగుల సీతాకోక చిలుకను టాటూగా వేయించుకుంది. ఇప్పుడు తన ప్రేమికుడి కోసం తన భర్త కోసం ఇలా పుట్టిన రోజు విషెస్ చెప్పడానికే ఈ టాటూని వేయించుకుని తన భర్తకు గిఫ్ట్ గా ఇచ్చిందంటున్నారు నెటిజన్స్.. ఎంత అందమైన గిఫ్ట్ కదా అని పొగిడేస్తున్నారు. ఇక గుప్పెడంత మనసులో జగతి మేడంగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించింది. జ్యోతి ‘ప్రెటీ గాళ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం సుకు పూర్వజ్ డైరెక్షన్ లో ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఐతే గుప్పెడంత మనసులో జగతి పాత్రలో నుదుటిన బొట్టు, చీర కట్టులో నిండైన బట్టల్లో.. అమ్మ గుర్తొచ్చేలా కనిపించిన జ్యోతి రాయ్ ని ఇప్పుడు బోల్డ్ ఫోటో షూట్స్ లో అస్సలు చూడలేకపోతున్నాం అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ జ్యోతి మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే టైపు కాబట్టి జీవిత సారం పూర్తిగా తెలిసిన నటి కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ నచ్చిన మూవీస్ చేస్తోంది అని కూడా ఆమెని పిచ్చిగా అభిమానించే కొంతమంది అభిమానులు అంటున్నారు.
![]() |
![]() |